K E Gnanavel Raja : తెలుగు వాళ్ళు గ్రేట్.. మా తమిళ్ వాళ్ళు తెలుగు హీరోలని పట్టించుకోరు.. తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని కూడా మన అనుకోని దగ్గరికి తీసుకుంటాము. కానీ తమిళ్ ఆడియన్స్ అసలు తెలుగు హీరోలని పట్టించుకోరు.

K E Gnanavel Raja : తెలుగు వాళ్ళు గ్రేట్.. మా తమిళ్ వాళ్ళు తెలుగు హీరోలని పట్టించుకోరు.. తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

Tamil Star Producer KE Gnanavel Raja Sensational Comments on Tamil Audience and Praising Telugu Audience

Updated On : July 11, 2024 / 9:12 AM IST

K E Gnanavel Raja : తమిళ సినిమాలన్నీ ఇక్కడ తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతాయి. ఇక తమిళ్ స్టార్ హీరోల సినిమాలైతే ఇక్కడ కూడా భారీగా రిలీజ్ అవుతాయి. సూర్య, కార్తీ, రజినీకాంత్, కమల్ హాసన్, శివ కార్తికేయన్, విజయ్, అజిత్.. ఇలా చాలా మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా అభిమానులు, భారీ మార్కెట్ ఉంది. కానీ తెలుగు హీరోల సినిమాలు తమిళ్ లో రిలీజయినా పెద్దగా పట్టించుకోరు.

మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని కూడా మన అనుకోని దగ్గరికి తీసుకుంటాము. కానీ తమిళ్ ఆడియన్స్ అసలు తెలుగు హీరోలని పట్టించుకోరు. వాళ్ళు తెలుగే కాదు తమిళ్ తప్ప ఏ భాష సినిమాలని అంతగా పట్టించుకోరు. తాజాగా ఈ విషయం ఓ తమిళ అగ్ర నిర్మాత కూడా ఒప్పుకున్నారు. తమిళ అగ్ర నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత KE జ్ఞానవేల్ రాజా ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి కూడా పరిచయం అయ్యాడు. త్వరలో ఈయన నుంచి తంగలాన్, బడ్డీ, కండువా సినిమాలు తమిళ్, తెలుగులో రాబోతున్నాయి.

Also Read : Suresh Babu : టికెట్ రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే.. సురేష్ బాబు తాజా వ్యాఖ్యలు..

తాజాగా తెలుగు మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో KE జ్ఞానవేల్ మాట్లాడుతూ.. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ, అజిత్, విజయ్.. ఇలా చాలా మంది తమిళ్ హీరోలని తెలుగు వాళ్ళు తమ అనుకోని సొంతం చేసుకున్నారు, వాళ్ళని తమ హీరోలుగా, ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తారు. కానీ మా తమిళ్ ఆడియన్స్ మాత్రం తెలుగు హీరోలని దగ్గరకు తీసుకోరు, బయటి వాళ్ళని చూసినట్టే చూస్తారు. వాళ్ళని సొంతం చేసుకోవాలని కూడా అనుకోరు అని అన్నారు. దీంతో KE జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా తెలుగు ఆడియన్స్ మాత్రం నిజమే అంటూ ఆయనని అభినందిస్తున్నారు. మరి దీనిపై తమిళ్ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.