Samantha
Samantha : నాగచైతన్య తో విడాకుల అనంతరం సమంత దర్శకుడు రాజ్ తో లవ్ లో ఉందని, వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని అనేక వార్తలు వచ్చాయి. వాటికి తగ్గట్టు సమంత కూడా పలుమార్లు రాజ్ తో క్లోజ్ గా కనిపించింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి సిరీస్ లు చేస్తున్నారు, బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారు.
రాజ్ భార్య ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతుండటంతో సమంత – రాజ్ రిలేషన్ నిజమే అని అంతా అనుకుంటున్నారు. మరోసారి రాజ్ – సమంత ఫొటోలు వైరల్ గా మారాయి. సమంత అమెరికాలోని తానా, నాట్స్ సభల్లో పాల్గొనడానికి వెళ్ళింది. సామ్ తో పాటు రాజ్ నిడుమోరు కూడా వెళ్లడం గమనార్హం. సమంత తన అమెరికా ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Simran Choudhary : నెదర్లాండ్ వెకేషన్.. పూలతో క్యూట్ గా సిమ్రాన్ చౌదరి ఫొటోలు..
ఇందులో ఒక ఫోటోలో రాజ్ సమంత భుజంపై చేయి వేసి చాలా క్లోజ్ గా నడుస్తున్నారు. మరో ఫొటోలో సమంత రాజ్ తో పాటు పలువురు ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ లో పార్టీకి వెళ్లారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సమంత – రాజ్ గతంలో పలుమార్లు కనిపించినా ఈసారి ఇంత క్లోజ్ గా కనపడటంతో వీరి రిలేషన్ నిజమే అని భావిస్తున్నారు. మరి దీనిపై సామ్ – రాజ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
Also Read : RK Sagar : వచ్చే తెలంగాణ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ.. స్పందించిన ఆర్కే సాగర్..