RK Sagar : వచ్చే తెలంగాణ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ.. స్పందించిన ఆర్కే సాగర్..

నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు సాగర్.

RK Sagar : వచ్చే తెలంగాణ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ.. స్పందించిన ఆర్కే సాగర్..

RK Sagar

Updated On : July 9, 2025 / 12:32 PM IST

RK Sagar : మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేనలో చేరి ప్రస్తుతం తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఏపీ ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేసారు. జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా ముందుకెళ్తున్నారు సాగర్. అయితే వచ్చే ఎన్నికల్లో సాగర్ పోటీ చేస్తాడని రూమర్స్ వచ్చాయి.

సాగర్ నటించిన ది 100 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు సాగర్.

Also Read : Badass : సిద్ధు జొన్నలగడ్డ ‘బ్యాడాస్’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..

ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. నేను అయితే పాలిటిక్స్ లోనే ఉంటాను. పోటీ చేస్తానా లేదా అనేది పై వాళ్ళు నిర్ణయిస్తారు. పోటీ చేయమన్నా, వద్దన్నా నాకు ఒకే. స్టార్ క్యాంపైనర్ గా జనసేనకు ఎప్పుడూ ప్రచారం చేస్తాను. తెలంగాణలో జనసేన ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఇవేమి నేను కోరుకోలేదు. వచ్చిన బాధ్యతలు తీసుకుంటున్నాను. అవకాశం వస్తే చేస్తాను. ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పోటీ చేయాలా వద్దా అనేది ఆ సమయానికి తెలుస్తుంది అన్నారు.

ఆర్కే సాగర్ గోదావరిఖని, రామగుండం ప్రాంతానికి చెందిన వాడు. అతని తండ్రి సింగరేణిలో బొగ్గు కార్మికుడిగా పనిచేసారు. సాగర్ కి బొగ్గు గనుల్లో పనిచేసే వారి కష్టాలపై అవగాహన ఉంది. అందుకే తెలంగాణ 2028 ఎన్నికల్లో సాగర్ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి.

Also Read : RK Sagar : పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఛాన్స్ మిస్.. అది మిస్ అయినా ఆయనతో కలిసి..