Badass : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫ‌స్ట్ లుక్ అనౌన్స్‌..

సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి 'బ్యాడాస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Badass : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫ‌స్ట్ లుక్ అనౌన్స్‌..

Siddu Jonnalagadda Badass movie first look out now

Updated On : July 9, 2025 / 12:31 PM IST

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయ‌న రవికాంత్‌ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బ్యాడాస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. If middle finger was a man అనేది ట్యాగ్ లైన్‌.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని సిగ‌రెట్ కాలుస్తూ ర‌ఫ్ లుక్‌లో కనిపించాడు సిద్దు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Mega 157 : అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’.. రీమిక్స్!

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ‌ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.