Mega 157 : అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’.. రీమిక్స్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగా157 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

Mega 157 : అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’.. రీమిక్స్!

Annayya Movie Song Remake in Mega 157

Updated On : July 9, 2025 / 10:56 AM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగా157 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో అన్నయ్య సినిమాలోని సూపర్ హిట్ సాంగ్.. ఆట కావాలా పాట కావాలా పాటను రీమిక్స్ చేస్తున్నారని హాట్ గాసిప్ నడుస్తోంది. ఈ రీమిక్స్ సాంగ్‌ను చిరు ఎనర్జీ, స్టైల్‌కి తగ్గట్టు మోడ్రన్ బీట్స్, గ్రాండ్ విజువల్స్‌తో డిజైన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. చిరంజీవి సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్స్‌తో ఈ సాంగ్ థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించబోతుందని టాక్. అన్నయ్య సినిమాలో సిమ్రాన్‌తో చిరంజీవి చేసిన రొమాంటిక్, ఫన్ వైబ్‌ను రీక్రియేట్ చేస్తూ, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ రీమిక్స్ సాంగ్ కొత్త టచ్‌తో రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నప్పటికీ, స్పెషల్ సాంగ్ కోసం ఒక యంగ్ డాన్సర్ లేదా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునే ప్లాన్ ఉందంటున్నారు.

Aishwarya Rajesh : ఇప్పుడు నలుగురు పిల్లలు.. సీక్వెల్ లో ఆరుగురు పిల్లలు..

ఆట కావాలా పాట కావాలా.. సాంగ్‌ను హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో షూట్ చేస్తారట. లేటెస్ట్ వీఎఫ్‌ఎక్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి కొత్త లుక్‌లో, తన ఐకానిక్ డాన్స్ మూమెంట్స్‌తో ఈ సాంగ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్తారని, వెంకటేష్ కీలక పాత్రతో సినిమాకి మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.

ఈ రీమిక్స్ సాంగ్, అన్నయ్యలోని నాస్టాల్జియాను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి, చిరు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇవ్వబోతుందని, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, యాక్షన్, డాన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపడం ఖాయమన్న హోప్స్ క్రియేట్ అవుతున్నాయి. చిరంజీవి, నయనతార, వెంకటేష్ కాంబోతో ఈ సినిమా మాస్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంటున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్న మెగా 157 మూవీ ఫ్యాన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.