Aishwarya Rajesh : ఇప్పుడు నలుగురు పిల్లలు.. సీక్వెల్ లో ఆరుగురు పిల్లలు..
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Aishwarya Rajesh
Aishwarya Rajesh : తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. వెంకటేష్ సరసన భార్యగా, నలుగురు పిల్లలకు తల్లిగా నటించి అదరగొట్టింది. సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్వించింది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, వెంకటేష్ కూడా ఈ సీక్వెల్ ఉంటుందని కంఫర్మ్ చేసారు. 2027 సంక్రాంతి పండక్కి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అనే టైటిల్ తో సీక్వెల్ రాబోతుందని సమాచారం.
Also Read : Dhanya Balakrishna : మొదటి సీనే మహేష్ బాబుకి ప్రపోజ్ చేయాలి.. నాకు తెలుగు రాదు.. మహేష్ ఏమన్నారంటే..
తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గురించి చెప్పారు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించాను. నాకు పిల్లలు అంటే ఇష్టం. సీక్వెల్ లో నాకు ఆరుగురు పిల్లలు ఉంటారు అని అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ చెప్పారు అని తెలిపింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా ఫుల్ కామెడితో థ్రిల్లింగ్ గా, ఐశ్వర్య పాత్ర కూడా ఇంకా అదిరిపోతుందని తెలుస్తుంది.