Naga Chaitanya – Samantha : సోషల్ మీడియాలో సమంతతో ఉన్న ఆ ఫొటో డిలీట్ చేయమని.. నాగచైతన్యపై ఫ్యాన్స్ ఫైర్..

చైతన్య - సమంత విడిపోయాక సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలని ఇద్దరూ డిలీట్ చేసేసారు. కానీ నాగచైతన్య మాత్రం ఒక ఫొటో అలాగే ఉంచాడు.

Samantha Fans Fires on Naga Chaitanya for a Post in his Social Media

Naga Chaitanya – Samantha : నాగచైతన్య – సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి చైతన్య ఫ్యాన్స్ సమంత మీద, సమంత ఫ్యాన్స్ చైతన్య మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్లిద్దరూ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తమ లైఫ్ చూసుకుంటున్నారు. అయితే నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళని నిశ్చితార్థం చేసుకోవడంతో మరోసారి సమంత అభిమానులు చైతన్య పై ఫైర్ అవుతున్నారు.

చైతన్య – సమంత విడిపోయాక సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలని ఇద్దరూ డిలీట్ చేసేసారు. కానీ నాగచైతన్య మాత్రం ఒక ఫొటో అలాగే ఉంచాడు. ఈ ఫొటోలో చైతన్య సమంత ఒక కార్ నుంచి దిగుతున్నట్టు ఉంటుంది. ఈ ఫొటో 2018లో షేర్ చేసారు. చైతన్య ఈ ఫొటో షేర్ చేసి.. నేను, నా గర్ల్ ఫ్రెండ్ అని పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో ఇద్దరి ఫేస్ లు కనిపించకపోవడం గమనార్హం.

Also Read : NTR – Devara Shoot : ఎన్టీఆర్ డ్యాన్స్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. ‘దేవర’ సాంగ్ షూట్‌ నుంచి కెమెరామెన్ ట్వీట్..

అయితే ఇప్పుడు శోభితతో నిచ్చితార్ధం చేసుకోవడంతో సమంత ఫ్యాన్స్ ఈ పోస్ట్ డిలీట్ చేయాలని ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫొటో ఎందుకు ఉంచావు అని ప్రశ్నిస్తూ, సమంతని బాధపెట్టావు అంటూ సమంత ఫ్యాన్స్ చైతన్యపై పలు విమర్శలు చేస్తూ ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి నాగచైతన్య ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. చైతన్యకి కార్లు, బైక్స్ అంటే ఇష్టమని తెలిసిందే. ఈ ఫొటోలో కార్ ఉంది కాబట్టే ఆ పోస్ట్ ఉంచాడు, సమంత కోసం ఈ పోస్ట్ ఉంచలేదు అని చైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాచైతన్య – శోభిత నిశ్చితార్థంతో మరోసారి సమంత కూడా వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు