NTR – Devara Shoot : ఎన్టీఆర్ డ్యాన్స్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. ‘దేవర’ సాంగ్ షూట్‌ నుంచి కెమెరామెన్ ట్వీట్..

తాజాగా దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దేవర సెట్స్ నుంచి రత్నవేలు తన ఫోటోని నేడు తెల్లవారుజామున షేర్ చేసి..

NTR – Devara Shoot : ఎన్టీఆర్ డ్యాన్స్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. ‘దేవర’ సాంగ్ షూట్‌ నుంచి కెమెరామెన్ ట్వీట్..

Devara Cinematographer Rathnavelu Shares a Tweet on NTR Dance from Song Shoot

Updated On : August 11, 2024 / 9:11 AM IST

NTR – Devara Shoot : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి పార్ట్ 1 సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి దగ్గరికి రావడంతో శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాలో ఒక సాంగ్ ని రాత్రి పూట షూట్ చేస్తున్నారు.

తాజాగా దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దేవర సెట్స్ నుంచి రత్నవేలు తన ఫోటోని నేడు తెల్లవారుజామున షేర్ చేసి.. ఒక అదిరిపోయే పాటను షూట్ చేస్తున్నాము. అనిరుధ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. డ్యాన్స్ లో తారక్ స్టైల్, గ్రేస్ అదిరిపోయింది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ఈ పాటకు. గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు అని ట్వీట్ చేసారు. దీంతో రత్నవేలు ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Avatar 3 : ‘అవతార్’ పార్ట్ 3 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్.. మొన్న నీళ్ళల్లో ఇప్పుడు మంటల్లో..

సాధారణంగానే ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. ఇప్పటికి దేవర నుంచి వచ్చిన రెండు పాటల్లోనూ ఎన్టీఆర్ డ్యాన్స్ చేసే స్కోప్ ఉండదని అర్ధమయిపోయింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా నుంచి ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎన్టీఆర్ డ్యాన్స్ ని పొగుడుతూ ట్వీట్ వేయడంతో ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.