Avatar 3 : ‘అవతార్’ పార్ట్ 3 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్.. మొన్న నీళ్ళల్లో ఇప్పుడు మంటల్లో..

తాజాగా డిస్నీ ఈవెంట్లో అవతార్ పార్ట్ 3 టైటిల్ ప్రకటించి దానికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ ప్లే చేసారు. అలాగే అవతార్ పార్ట్ 3 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు.

Avatar 3 : ‘అవతార్’ పార్ట్ 3 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్.. మొన్న నీళ్ళల్లో ఇప్పుడు మంటల్లో..

Avatar Part 3 Tittle and Release Date Announced in Disney Event

Updated On : August 11, 2024 / 8:59 AM IST

Avatar 3 : హాలీవుడ్ లో అతి పెద్ద సినిమా ఫ్రాంఛైజీలో అవతార్ ఒకటి. 15 ఏళ్ళ క్రితం హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా అప్పటి ప్రేక్షకులని మైమరిపించింది. పండోరా గ్రహం అని కొత్త గ్రహాన్ని, కొత్త రకాల మనుషులని చూపించి అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయింది. 2009లో అవతార్ సినిమా రాగా ఆ తర్వాత 13 ఏళ్లకు 2022లో అవతార్ పార్ట్ 2 వచ్చింది.

2022 డిసెంబర్ లో ‘అవతార్ – ది వే ఆఫ్ వాటర్’ అనే పేరుతో ఈ సినిమా రిలీజయింది. ఇందులో సరికొత్త నీళ్ల ప్రపంచం చూపించారు. ఇక ఈ అవతార్ కి మరో మూడు సీక్వెల్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డిస్నీ ఈవెంట్లో అవతార్ పార్ట్ 3 టైటిల్ ప్రకటించి దానికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ ప్లే చేసారు. అలాగే అవతార్ పార్ట్ 3 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు.

Also Read : NTR – Prashanth Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా కథ ఇదేనా? పీరియాడిక్ బ్యాక్ డ్రాప్.. డ్రగ్ మాఫియా డాన్ గా ఎన్టీఆర్..?

అవతార్ పార్ట్ 3 కి ‘అవతార్ – ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్ ని ప్రకటించారు. పార్ట్ 2లో నీళ్ల ప్రపంచం చూపిస్తే ఇప్పుడు అగ్ని ప్రపంచం చూపించబోతుందని తెలుస్తుంది. అలాగే అవతార్ 3ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అవతార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.