×
Ad

Samantha : తీవ్ర విషాదంలో సమంత.. తండ్రి కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూశారు.

  • Published On : November 29, 2024 / 05:04 PM IST

Samantha father Joseph Prabhu passed away

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. శుక్రవారం సాయంత్రం తన తండ్రి మరణాన్ని ప్రకటిస్తూ షాకింగ్ పోస్ట్‌ను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని తెలుపుతూ.. “మనం మళ్లీ కలిసే వరకు నాన్న” అని హార్ట్ బ్రేకింగ్ ఎమోజి పెట్టింది. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ‘పీలింగ్స్’ సాంగ్.. తెలుగులో అర్ధమేంటో తెలిసిపోయింది..

సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఇక ఇప్పటికే సమంత ఎన్నో ఇంటర్వూస్ లో తన ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా తన తండ్రి గురించి చెప్పింది. తనకి మాయోసైటిస్ వచ్చిన సమయంలో తన కుటుంబం తనకి తోడుగా ఉందని తెలిపింది. అలాగే సమంత విడాకులు తీసుకున్న సమయంలో కూడా తన తండ్రి తనకి తోడుగా ఉన్నాడు. అంతేకాదు నాగచైతన్య, సమంత విడిపోయినప్పుడు కూడా ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సమంత నువ్వు స్ట్రాంగ్ గా ఉందని ధైర్యాన్ని అందిస్తున్నారు.