Maa Inti Bangaram Collection: స‌మంత ‘మా ఇంటి బంగారం’ తొలి రోజు కలెక్ష‌న్స్..

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మా ఇంటి బంగారం మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద (Maa Inti Bangaram Day 1) మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

Samantha Maa Inti Bangaram first day collections

Maa Inti Bangaram Collection : సమంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న(జూన్ 19న ) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.13.15 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది. ఓ బేబీ చిత్రం త‌రువాత స‌మంత‌, నందిని రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకోవ‌డంతో ఈ మూవీ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

*Allu Arjun : అభిమాని కోరికను నెరవేర్చి మరోసారి మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్‌

గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇక ఈ రోజు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈచిత్ర క‌లెక్ష‌న్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

*Klin Kaara Birthday : క్లిన్ కారా కొణిదెల బ‌ర్త్ డే.. పాత ఫోటోలు వైర‌ల్‌..