Allu Arjun : అభిమాని కోరికను నెరవేర్చిన అల్లు అర్జున్.. వీడియో సూపర్
తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న చిన్నారి శ్రద్ధ జీవితంలో మరపురాని క్షణాన్ని సృష్టించారు అల్లు అర్జున్ (Allu Arjun).
Allu Arjun video call to fan Shraddha
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న చిన్నారి శ్రద్ధ జీవితంలో మరపురాని క్షణాన్ని సృష్టించారు. బన్నీ వీడియో కాల్ ద్వారా ఆ చిన్నారి అభిమానిని పలకరించారు. తన అభిమాన హీరోతో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో శ్రద్ధ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి శ్రద్ధ తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ను కలవాలని అనుకుంది. ప్రముఖ సేవా సంస్థ ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఐకాన్ స్టార్ వెంటనే స్పందించి చిన్నారి శ్రద్ధకు వీడియో కాల్ చేశారు. శ్రద్ధతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Klin Kaara Photos : క్లిన్కారా బర్త్ డే.. పాత ఫోటోలు వైరల్..
అనారోగ్యంతో బాధపడుతూ తనతో మాట్లాడమని అడిగిన చిన్నారి శ్రద్ధ కోరిక తీర్చిన అల్లు అర్జున్
ఓ NGO సాయంతో హీరోను సంప్రదించగా చిన్నారికి వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించిన బన్నీ pic.twitter.com/JUTI61Wib3
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2026
ఈ సందర్భంగా చిన్నారి తనకు ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్ చెప్పాలని ఉందని కోరింది. వెంటనే స్పందించిన బన్నీ.. ఆమెతో కలిసి డైలాగ్ చెప్పించారు. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్” అంటూ శ్రద్ధ ముద్దుగా చెప్పడంతో పాటు తగ్గేదే లే.. మేనరిజాన్ని కూడా చేసి చూపించింది.
ఇక పెద్ద అయ్యాక నువ్వు ఏం కావాలని చిన్నారిని బన్నీ అడుగగా.. డాక్టర్ కావాలని ఉందని సమాధానం చెప్పింది. దీనికి ఎంతో సంతోషించిన అల్లు అర్జున్.. చిన్నారి ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధించాలని కోరుకున్నారు. త్వరగా ఆ చిన్నారి పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోలుకున్న తరువాత హైదరాబాద్ వచ్చి తనను వ్యక్తిగతంగా కలవాలని శ్రద్ధను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా.. చిన్నారి కోరికను నెరవేర్చిన అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Dhanush-Mrunal Thakur : ధనుష్–మృణాల్ ప్రేమ కథకు బ్రేకప్ ట్విస్ట్?
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. దీపికా పదుకొణె కథానాయిక నటిస్తుండగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తోంది.
