Samantha Maa Inti Bangaram movie teaser trailer out now
Maa Inti Bangaram: సౌత్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం(Maa Inti Bangaram). చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది. లేడీ దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓపక్క ఫ్యామిలీ, మరోపక్క యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టేసింది సమంత. ఈ తరహా సినిమాలు తెలుగులో కొత్తేమి కాదు. కానీ, సమంత ఇలాంటి యాక్షన్ మోడ్ లో కనిపించడం కొత్తగా అనిపించింది. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు, సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి రెండో పెళ్లి తరువాత భర్తతో కలిసి సమంత చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.