Maa Inti Bangaram Twitter Review : మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ.. సమంత వన్ ఉమెన్ షో..
సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా (Maa Inti Bangaram Twitter Review) వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 19, 2026 / 10:24 AM IST
Samantha Maa Inti Bangaram twitter review
Maa Inti Bangaram Twitter Review : సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నేడు శుక్రవారం (జూన్ 19) ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ బేబీ చిత్రం తరువాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సమంత మాస్ యాక్షన్ అదిరిపోయిందని, సామ్ వన్ మ్యాన్ షో అని కామెంట్లు పెడుతున్నారు. సమంత ఖాతాలో మరో హిట్ పడినట్లే అని అంటున్నారు.
More Reviews – Vanda Devullu Review : ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు..
