Samantha maintaining the rosary Regularly
Samantha : సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా సమయంలో తనకి ఏ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. యశోద సినిమాకి ఒక ఇంటర్వ్యూ వాళ్లే చేసి ప్రమోషన్స్ కి ఇచ్చారు. అప్పట్నుంచి సమంత అసలు మీడియా ముందుకి రాలేదు. బయట కూడా కనిపించలేదు. దాదాపు కొన్ని నెలలుగా సమంత కనపడకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది సమంత. మళ్ళీ నేడు శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించింది. సమంత చాలా రోజుల తర్వాత కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సమంత కొంచెం సన్నగా అవ్వడం, ఫేస్ లో గ్లో తగ్గడం, ఫేస్ డల్ గా ఉండటంతో అభిమానులు పాపం సమంత ఇలా అయిపొయింది ఏంటి అనుకుంటున్నారు. అయితే మొన్న ఎయిర్ పోర్ట్ లో, నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా సమంత తన చేతికి ఒక జపమాల చుట్టుకొని కనపడింది.
Allu Arha : శాకుంతలంలో సింహంపై అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ.. సినిమాలో అర్హ క్యారెక్టర్ ఇదేనా??
సమంత చేతికి ఒక తులసి జపమాల చుట్టుకుంది. ఇలా కనపడిన రెండు సార్లు జపమాల ఉండటంతో అంతా దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే సాధారణంగా తులసిమాల వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనసు కూడా ప్రశాంతంగా అంటుందని చాలామంది నమ్ముతారు. దీంతో సమంత కూడా ఆ తులసి జపమాల ఆరోగ్యం కోసం, చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి, నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండటానికి చుట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ జపమాలని ఫోటో తీసి తన స్టోరీలో కూడా పెట్టింది.