Samantha post goes Viral Curiosity in Netizens
Samantha : సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు, తన పాడ్ కాస్ట్ లతో అందరికి దగ్గరవుతుంది. త్వరలో సమంత సిటాడెల్ సిరీస్ తో రాబోతుంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఓ సినిమాని కూడా ప్రకటించింది.
Also Read : RGV : తమిళ్ స్టార్‌తో ఆర్జీవీ భేటీ.. సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా బ్రో..
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో.. నువ్వు గెలవడం నేను చూడాలి అని ఇంగ్లీష్ లో కొటేషన్ ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో షేర్ చేస్తూ.. నీ హృదయం ఏం కోరుకుంటే, నువ్వు ఏం అవ్వాలనుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను. మీరు విజయానికి అర్హులు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.+
సమంత ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి పోస్ట్ చేసింది, ఎవరు గెలవాలనుకుంటుంది అని అర్ధం కాక అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి సమంత ఈ పోస్ట్ ఎవరికోసం పెట్టిందో ఆమెకే తెలియాలి.