×
Ad

Samantha – Tamannaah : ఒక్క ఫొటోతో తమన్నా, విజయ్ డేటింగ్‌ని బయటపెట్టేసింది సమంత..

ఒక్క ఫొటోతో సమంత.. తమన్నా, విజయ్‌ల డేటింగ్ ని బయటపెట్టేసిందిగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  • Published On : March 20, 2024 / 04:54 PM IST

Samantha reveals Tamannaah vijay varma dating with single photo

Samantha – Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో పడ్డారు. గోవా న్యూ ఇయర్ పార్టీతో బయటపడ్డ వీరి ప్రేమాయణం.. ఆ తరువాత బాలీవుడ్ ఈవెంట్స్‌లో, ముంబై వీధుల్లో కనిపిస్తూ వచ్చింది. ఆ తరువాత ‘లస్ట్ స్టోరీస్ 2’లో వీరిద్దరూ చేసిన రోమాన్స్.. ప్రేమ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే తమన్నా.. తమ ప్రేమని అంగీకరిస్తూ బయటపెట్టారు.

అయితే వీరిద్దరూ ప్రేమ చెట్టపట్టాలు వేసుకొని తిరగడం వరుకే ఉందా..? లేదా డేటింగ్ కూడా చేస్తున్నారా..? అనేది ఒక ప్రశ్నగా మారింది. బయట ఎక్కడ కనిపించినా.. ఇద్దరు కలిసే కనిపిస్తున్నారు. అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫొటోతో.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు అనే విషయాన్ని నిజం చేసింది. రీసెంట్ గా సమంత, తమన్నా, విజయ్.. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Also read : RC16 : రామ్‌చరణ్ RC16 బయోపిక్‌గా రాబోతోందా.. లండన్ రాజులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్.. టైటిల్ అదేనా..

ఆ ఈవెంట్ లో తమన్నాతో కలిసి దిగిన ఫోటోని సమంత షేర్ చేసారు. ఆ పిక్ లో సమంత, తమన్నాని కౌగిలించుకొని కనిపిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న అద్దంలో విజయ్ ప్రతిబింబం కనిపిస్తుంది. సమంత, తమన్నాని ఫోటో తీస్తున్న విజయ్ ప్రతిబింబం.. ఆ అద్దంలో కనిపిస్తుంది. ఇక ఈ పిక్ లో గమనిస్తే.. సమంత పార్టీ డ్రెస్సులో ఉంటే, తమన్నా అండ్ విజయ్ మాత్రం నార్మల్ రూమ్ లో ధరించే డ్రెస్సులో కనిపిస్తున్నారు.

ఇక ఈ ఫోటో చూసిన నెటిజెన్స్.. తమన్నా, విజయ్ కలిసే ఉంటున్నారని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఒక్క ఫొటోతో సమంత.. తమన్నా, విజయ్‌ల డేటింగ్ ని బయటపెట్టేసిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ప్రేమ జంట పెళ్లి జీవితాన్ని ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.