RC16 : రామ్‌చరణ్ RC16 బయోపిక్‌గా రాబోతోందా.. లండన్ రాజులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్.. టైటిల్ అదేనా..

రామ్‌చరణ్ RC16 మూవీ ఆ గొప్ప వ్యక్తి స్టోరీతో రాబోతోందా. లండన్ రాజులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్‌గా పేరు గాంచిన..

RC16 : రామ్‌చరణ్ RC16 బయోపిక్‌గా రాబోతోందా.. లండన్ రాజులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్.. టైటిల్ అదేనా..

Ram Charan Janhvi Kapoor RC16 Movie is a biopic of Kodi Rammurthy Naidu

RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమాని చేస్తున్నారు. నేడు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసారు. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వీటితో పాటు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా బయోపిక్ గా రాబోతుందని చెబుతున్నారు. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన మల్లయోధుడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించిన కోడి రామ్మూర్తి.. చిన్నతనం నుంచే భారీ కసరత్తులు చేస్తూ కుస్తీలో ప్రావిణ్యం సంపాదిస్తూ వచ్చారు.

ఆ తరువాత వ్యాయామ ఉపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకున్న రామ్మూర్తి.. తాను చదివిన హైస్కూలులోనే వ్యాయామ శిక్షకుడిగా చేరాడు. అనంతరం సర్కస్ కంపెనీ ప్రారంభించి ఎంతో పేరుని సంపాదించుకున్నారు. ఏనుగులను తన ఎదపై ఎక్కించుకోవడం, ఇనుప గొలుసులను తెప్పేయడం, భారీ వాహనాలను లాగడం వంటి సాహసాలతో విదేశీయులను కూడా ఆశ్చర్యపరిచారు.

Also read : Ilayaraaja : ‘ఇళయరాజా’ బయోపిక్‌లో ధనుష్.. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్..

దీంతో విదేశాల నుంచి కూడా కోడి రామ్మూర్తి నాయుడుకి ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే లండన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, జపాన్, చైనా, బర్మా వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. లండన్‌ బ‌కింగ్‌హ‌మ్ ప్యాలెస్‌లో ఇచ్చిన ప్రదర్శన చూసిన రాజదంపతులు.. రామ్మూర్తికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుని ఇచ్చారు. అంతేకాదు, లండన్‌ రాజదంపతులు రామ్మూర్తికి ప్రత్యేక విందు ఇచ్చి గౌరవంగా సత్కరించారు.

ఇలా లండన్ రాజదంపతుతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్ గా కోడి రామ్మూర్తి నాయుడు నిలిచారు. కాగా రామ్మూర్తి బర్మా దేశంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళినప్పుడు.. ఆయనను కొందరు చంపాలనుకున్నారు. కానీ అది తెలుసుకొని బయటపడ్డారు. రామ్మూర్తి గొప్ప మల్లయోధుడు మాత్రమే కాదు. గొప్ప దేశభక్తుడు కూడా, తన సంపాదనలో చాలావరకు జాతీయోద్యమాలకు దానం చేసేవారు. ఈయనని ‘కలియుగ భీమ’ అని పిలిచేవారు. ఈ బిరుదునే ఇప్పుడు మూవీ టైటిల్ గా పెడుతున్నారట.

ఇలాంటి గొప్ప వ్యక్తి పాత్రనే రామ్ చరణ్ పోషించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సినిమా కూడా ‘దంగల్’లా అద్భుతాలు సృష్టిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కథలో విదేశాలకు సంబంధించిన పాయింట్స్ కూడా ఉండడంతో.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లా ఉంటుంది. మరి బుచ్చిబాబు ఈ కథతోనే వస్తున్నారా లేదా అనేది చూడాలి.