Ilayaraaja : ‘ఇళయరాజా’ బయోపిక్‌లో ధనుష్.. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్..

సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది.

Ilayaraaja : ‘ఇళయరాజా’ బయోపిక్‌లో ధనుష్.. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్..

Ilayaraaja Biopic coming Soon Dhanush will Play Main Lead Character

Updated On : March 20, 2024 / 2:08 PM IST

Ilayaraaja : సంగీత ప్రపంచంలో రారాజు, మ్యాస్ట్రో ఇళయరాజా..1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్.. భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఇళయరాజా పాటలు అయితే చెవి కోసుకొని వారు ఉండరు. ఆయన పాట వింటే చాలు పాటతో, ఆ సంగీతంతో ప్రేమలో పడిపోతాం. ప్రతి సంగీతాభిమాని ఇళయరాజాకు అభిమానే. ఎన్నో వేల అద్భుతమైన పాటలతో ప్రేక్షకులని మెప్పించిన ఇళయరాజా ఇప్పటికి 80 ఏళ్ళ వయసులోనూ సినిమాలకు సంగీతం అందిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు.

ఇప్పుడు సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. ఇళయరాజా బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో ఇళయరాజాలా కనిపించబోతున్నారు. తాజాగా నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఇళయరాజా అనే టైటిల్ తోనే బయోపిక్ ప్రకటించారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ సినిమాని తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు. ఇళయరాజా సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తారు.

Also Read : Mohan Babu : ప్లీజ్ నాకు విలన్ క్యారెక్టర్ ఇవ్వు.. మోహన్ లాల్‌ని రిక్వెస్ట్ చేసిన మోహన్ బాబు..

నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. టైటిల్ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. ఈ పోస్టర్ లో చెన్నై రోడ్ల మీద ఇళయరాజా హార్మోనియం పెట్టె పట్టుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. సినిమా లాంచ్ అనంతరం ధనుష్ మాట్లాడుతూ.. ఇళయరాజా సర్ బయోపిక్ చేస్తునందుకు గర్వంగా ఉంది. నేను లైఫ్ లో ఇద్దరి బయోపిక్ లు తీయాలని అనుకున్నాను. ఒకటి ఇళయరాజా సర్, రెండు సూపర్ స్టార్ రజినీకాంత్ అని తెలిపారు. ఇక ఈ సినిమాలో చాలామంది తమిళ్, తెలుగు స్టార్లు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని సమాచారం. ఇళయరాజా బయోపిక్ వస్తున్నందుకు ఆయన పాటల అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.