Samantha says about his favourite cricketers
IPL 2023 : సమంత, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ఖుషి(Kushi) సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేయగా ఇది ప్రేక్షకులని మెప్పించింది. అయితే తాజాగా సమంత, విజయ్ దేవరకొండ షూటింగ్ టైంలోనే ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. IPL నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ వీరిని సరదాగా ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి మాట్లాడింది.
Krithi Shetty : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లాంటి పాటలు నేను చేయను.. కానీ సమంత..
సమంత మాట్లాడుతూ.. MS ధోని నా ఫేవరేట్ క్రికెటర్. అసలు ధోని అంత కూల్ గా ఎలా ఉంటాడో అర్థంకాదు. ఆ విషయంలో చాలా ఇష్టం. IPL లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే నాకు ఇష్టం. ఆ టీంకు సపోర్ట్ చేస్తాను. ఇక విరాట్ కోహ్లీ అంటే కూడా ఇష్టం. గతేడాది విరాట్ కోహ్లీ ఆసియాకప్ లో కంబ్యాక్ సెంచరీ చేసినప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అప్పుడు ఏడ్చేశాను కూడా అని తెలిపింది. సమంత.. ధోని, కోహ్లీ గురించి వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.