Samantha : సమంతకు ఏజ్ కేవలం 23 ఏళ్ళే.. సీక్రెట్ షేర్ చేసిన సమంత.. ఎలా అంటే?

సమంత తాజా పోస్ట్ లో తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న ఓ ఫోటో, తాను ఉన్న లొకేషన్ అందాలు చూపిస్తున్న ఫొటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ ఉన్న ఓ పేపర్ ని పోస్ట్ చేసింది.

Samantha Shares her Metabolic Age is just 23 post goes Viral

Samantha : సమంత ప్రస్తుతం నటిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి హెల్త్ మీద ఫుల్ ఫోకస్ చేసినా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే ఓ హెల్త్ పాడ్ కాస్ట్ కూడా మొదలుపెట్టింది. తాను నటించిన సిటాడెల్ సిరీస్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతున్న సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

సమంత తాజా పోస్ట్ లో తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న ఓ ఫోటో, తాను ఉన్న లొకేషన్ అందాలు చూపిస్తున్న ఫొటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ ఉన్న ఓ పేపర్ ని పోస్ట్ చేసింది. ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్ కేవలం 23 ఏళ్ళు అని ఉంది. ఇక అదే పేపర్ లో సమంత వెయిట్ 50 కేజీలు అని, ఇంకా ఫ్యాట్, బోన్స్, BMR.. ఇలా హెల్త్ కి సంబంధించిన వాటి వివరాలు ఉన్నాయి. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్(Metabolic Age) 23 ఏళ్ళే అని ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతూ అసలు మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అని తెగ వెతికేస్తున్నారు. సాధారణంగా మన వయసు పుట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే అంత ఏజ్ కింద లెక్కేస్తారు. కానీ మెటబాలిక్ ఏజ్ అనేది మన బాడీ హెల్త్ ని బట్టి లెక్కస్థారు. మన అసలు ఏజ్ కంటే కూడా మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. చాలామంది సెలబ్రిటీలకు వాళ్ళ అసలు ఏజ్ కంటే కూడా మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉంటుంది.

Also Read : Sree Vishnu : ‘ఓం భీమ్ బుష్’ అంటున్న శ్రీవిష్ణు.. ఆ ఇద్దరితో కలిసి మళ్ళీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడుగా..

అలాగే ఇప్పుడు సమంతకు 36 ఏళ్ళు అయినా మెటబాలిక్ ఏజ్ మాత్రం 23 ఏళ్ళే. దానికి తగ్గట్టు సామ్ అంత ఫిట్నెస్, బరువు, ఆరోగ్యంగా ఉందని అర్ధం. రోజూ హెల్తీ ఫుడ్, వ్యాయామాలు.. లాంటి వాటితో సెలబ్రిటీలు ఈ మెటబాలిక్ ఏజ్ ని మెయింటైన్ చేస్తారు. సమంత కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి హెల్త్ మీదే ఫోకస్ చేసి ఇలా తన మెటబాలిక్ ఏజ్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది. దీంతో సమంత మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్ళే అని చెప్పడంతో అందుకే సామ్ ఇంకా అంత క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు