Sree Vishnu : ‘ఓం భీమ్ బుష్’ అంటున్న శ్రీవిష్ణు.. ఆ ఇద్దరితో కలిసి మళ్ళీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడుగా..

ఇప్పుడు మరో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు శ్రీవిష్ణు.

Sree Vishnu : ‘ఓం భీమ్ బుష్’ అంటున్న శ్రీవిష్ణు.. ఆ ఇద్దరితో కలిసి మళ్ళీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడుగా..

Sree Vishnu Coming with Om Bheem Bush Hilarious Entertainment Movie

Updated On : February 22, 2024 / 11:18 AM IST

Sree Vishnu : శ్రీవిష్ణు ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ఎక్కువగా ప్రేక్షకులని నవ్వించడానికి సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసి కూడా మెప్పిస్తాడు. గత సంవత్సరం సామజవరగమన సినిమాతో వచ్చి ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీవిష్ణు తన కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలబెట్టాడు.

ఇప్పుడు మరో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఆల్రెడీ నిన్న ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ముగ్గురు ఏలియన్స్ భూమి మీదకు దిగినట్టు ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఓం భీమ్ బుష్'(Om Bheem Bush) అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా టైటిల్ కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

Also Read : Raviteja : ఆ విషయంలో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ సక్సెస్.. ఇప్పుడు రవితేజ వంతు..

గతంలో ఈ ముగ్గురు కలిసి బ్రోచేవారెవరురా అనే సినిమాతో ప్రేక్షకులని నవ్వించి హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండటంతో వీటితోనే నవ్వొస్తుంది. ఇక సినిమాతో ఏ రేంజ్ లో నవ్విస్తారో చూడాలి. ఈ సినిమాని హుషారు సినిమా ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.