Raviteja : ఆ విషయంలో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ సక్సెస్.. ఇప్పుడు రవితేజ వంతు..

తాజాగా ఈ బాటలో రవితేజ వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

Raviteja : ఆ విషయంలో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ సక్సెస్.. ఇప్పుడు రవితేజ వంతు..

Raviteja

Raviteja : మన సినిమా సెలబ్రిటీలు సినిమాల్లో సక్సెస్ అయ్యాక బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారు. సినిమా కెరీర్ ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకే హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం సినిమాల్లో ఫేమ్ రాగానే ఆ ఫేమ్ తో బిజినెస్ లు మొదలుపెట్టడం లేదా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడం చేస్తారు. ఆల్మోస్ట్ టాలీవుడ్ నటీనటులందరికి ఏదో ఒక బిజినెస్ ఉంది.

ఇటీవల కొంతమంది స్టార్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో దిగి సక్సెస్ అవుతున్నారు. ఇలాంటివారికి ఏషియన్ సినిమాస్ సంస్థ సపోర్ట్ చేస్తుంది. మొదట ఈ ఏషియన్ సంస్థతో కలిసి మహేష్ బాబు(Mahesh Babu) AMB మల్టీప్లెక్స్ కట్టి బాగా సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ లో ఖరీదైన మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఇదొకటి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్(Alu Arjun) AAA సినిమాస్ అని హైదరాబాద్ అమీర్’పేట్ లో స్థాపించి దూసుకుపోతున్నాడు. ఇలా ముగ్గురు హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో సక్సెస్ అయి లాభాలతో దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురికి ఇవే కాకూండా ఇంకా చాలా బిజినెస్ లు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : Allu Sirish : అల్లు శిరీష్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌లో బ్లాక్ చేస్తే.. శిరీష్ వెంటనే ఫ్లైట్ ఎక్కేసి.. ఏం చేసాడో తెలుసా?

తాజాగా ఈ బాటలో రవితేజ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. రవితేజ ఇప్పటివరకు పెద్దగా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టలేదు. బిజినెస్ లు కూడా చేయలేదు. రీసెంట్ గానే RT టీంవర్క్స్ అని నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ కట్టబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ దిల్‌షుఖ్ నగర్ ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ కడతారని టాలీవుడ్ సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఇక రవితేజ ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయం సాధించాడు.