Allu Sirish : అల్లు శిరీష్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌లో బ్లాక్ చేస్తే.. శిరీష్ వెంటనే ఫ్లైట్ ఎక్కేసి.. ఏం చేసాడో తెలుసా?

అల్లు శిరీష్ ఇంటర్వ్యూలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Allu Sirish : అల్లు శిరీష్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌లో బ్లాక్ చేస్తే.. శిరీష్ వెంటనే ఫ్లైట్ ఎక్కేసి.. ఏం చేసాడో తెలుసా?

Allu Sirish Reveals Interesting Matter about his ex Girl Friend

Updated On : February 22, 2024 / 9:56 AM IST

Allu Sirish : అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు అర్జున్(Allu Arjun) తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఊర్వశివో రాక్షసివో సినిమాతో మెప్పించిన అల్లు శిరీష్ త్వరలో బడ్డీ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా అల్లు శిరీష్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.

అల్లు శిరీష్ ఇంటర్వ్యూలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఒకసారి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్ను ఫోన్ లో బ్లాక్ చేసింది. తను హైదరాబాద్ లో ఉండదు, బెంగళూరులో ఉంటుంది. ఎన్ని సార్లు కాల్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో ఇంక నా వాళ్ళ కాక ఫ్లైట్ ఎక్కేసి బెంగుళూరు వాళ్ళింటికి వెళ్ళిపోయాను. వాళ్ళింటికి వెళ్లి బెల్ కొట్టాను. డోర్ తీయగానే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలాగా నాకోసం ఇంత దూరం వచ్చాడా అని ఇంప్రెస్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇంట్లో తన పేరెంట్స్ ఉండటంతో అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ ఫైర్ అయింది నా మీద. ఇంకోసారి సినిమాలని రియల్ లైఫ్ లో ఉదాహరణకు తీసుకోకూడదు అని తెలిసొచ్చింది అంటూ నవ్వుతూ తెలిపాడు.

Also Read : Bellamkonda Sreenivas : ఏ హీరో సాధించలేని రికార్డ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో.. ఏకంగా మూడు సినిమాలతో..

ఈ సంఘటన అల్లు శిరీష్ సినిమాల్లోకి రాకముందు జరిగింది. మొత్తానికి అల్లు శిరీష్ కి కూడా ఒక లవ్ స్టోరీ ఉంది, అది బ్రేకప్ అయిందని తెలుస్తుంది.