Bellamkonda Sreenivas : ఏ హీరో సాధించలేని రికార్డ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో.. ఏకంగా మూడు సినిమాలతో..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ సంపాదిస్తుంటాయి.

Bellamkonda Sreenivas : ఏ హీరో సాధించలేని రికార్డ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో.. ఏకంగా మూడు సినిమాలతో..

Bellamkonda Sai Sreenivas creates new Record with his hindi dubbing Movies in You Tube

Updated On : February 22, 2024 / 8:55 AM IST

Bellamkonda Sreenivas : టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) మాస్ సినిమాలకు పెట్టింది పేరు. బోయపాటి సినిమాల్లో ఉండే మాస్ శ్రీనివాస్ పతి సినిమాలో కనిపిస్తుంది. కమర్షియల్ పరంగా ఇండస్ట్రీ హిట్స్ ఎక్కువగా కొట్టకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు హిందీలో ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ సంపాదిస్తుంటాయి.

ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించినా హిందీలో మాత్రం డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. జయ జానకి నాయక సినిమా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ మూవీ ప్రపంచంలో ఏ సినిమా అందుకొని రికార్డుని క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సినిమాగా జయ జానకి నాయక వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని జయ జానకి నాయక హిందీ రైట్స్ కొనుక్కున్న పెన్ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Vasanthi Krishnan : నటుడు పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ భామ.. అనంతరం వెంకన్న సన్నిధిలో..

ఇంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం సినిమా వేరువేరు ఛానల్స్ లో హిందీలో అన్ని కలిపి 800 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. ఇక సీత సినిమా ఒక్క ఛానల్ లోనే ఏకంగా 640 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. ఈ రేంజ్ లో ఇన్ని మిలియన్స్ వ్యూస్ తన సినిమాలతో సాధించిన ఏకైక హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ఇక శ్రీనివాస్ సినిమాలు అన్ని వ్యూస్ కలిపితే మరో సరికొత్త వరల్డ్ రికార్డ్ అవుతుందేమో. ఇక శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు.