Samantha : ‘పెద్ది’ రిలీజ్.. చిట్టిబాబు కోసం స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత..
తాజాగా సమంత అల్ ది బెస్ట్ చెప్తూ స్పెషల్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. (Samantha)
- Saketh U
- Published on- June 3, 2026 / 04:44 PM IST
Samantha
Samantha : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. నేడు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చూసి సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీంతో పెద్ది సినిమాపై భారీ హైప్ నెలకొంది.
ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు పెద్దికి శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా సమంత అల్ ది బెస్ట్ చెప్తూ స్పెషల్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ.. నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది సమయం. చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పెద్ది సినిమా అందరికి అల్ ది బెస్ట్. నాకు పెద్ది బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తుంది అని తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ సమంతకు థ్యాంక్స్ చెప్తున్నారు.
గతంలో సమంత – రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది.
#PEDDI in theatres tomorrow 💥💥💥
~ @Samanthaprabhu2! 🛐🔗 https://t.co/tG3hraSulg@AlwaysRamCharan #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/YUdDcvdgV3
— Samantha FC || TWTS™ (@Teamtwts2) June 3, 2026
Also Read : Buchibabu Sana : ఆ కటౌట్ వైరల్ అవ్వడంతో.. ఒరేయ్ అంటూ.. చరణ్ ఫ్యాన్స్ పై బుచ్చిబాబు రియాక్షన్..
