Samantha Shares Stylish Photos From Bathroom goes Viral
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ నుంచి పూర్తిగా బయటపడటానికి, ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి అని సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న సామ్ గత కొన్నాళ్లుగా పలు దేశాలు తిరిగేస్తూ ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా వెతుక్కుంటుంది. ప్రస్తుతం సామ్ ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటూ తన బిజినెస్ లు చూసుకుంటూ, హెల్త్ పాడ్‌కాస్ట్ లను ఇటీవలే మొదలుపెట్టింది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు, వీడియోలు, తన పాడ్‌కాస్ట్ ల గురించి షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సమంత బాత్రూంలో దిగిన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ షర్ట్, జీన్స్ ప్యాంటుతో సమంత రెడీ అయి ఇలా బాత్రూంలో స్టైలిష్ ఫొటోలు దిగడం విశేషం. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Also Read : Varalaxmi Sarathkumar : వరలక్ష్మికి కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా.. ఇది రెండో పెళ్లా?
ఇక సామ్ గతంలో బాలీవుడ్ లో చేసిన సిటాడెల్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క నిర్మాతగా కూడా సినిమాలు చేయబోతుంది. ఆమె త్వరగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.