Samantha Yashoda Movie Locks Release Date
Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను హరి, హరీష్‌లు డైరెక్ట్ చేయగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Yashoda Teaser: యశోద టీజర్.. మామూలుగా ఉండదట!
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమాను నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో సమంత పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Samantha Yashoda : సాలిడ్ అప్డేట్‌తో వచ్చిన యశోద.. పండగ చేసుకుంటున్న సామ్ ఫ్యాన్స్
ఇక ఈ సినిమాలో సమంతతో పాటు ఉన్నిముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే నవంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.