Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బరం, అందాల భామ చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద....
- Anil Aaleti
- Published on- July 7, 2022 / 12:50 PM IST
Sammathame Gets Ott Release Date
Sammathame: యంగ్ హీరో కిరణ్ అబ్బరం, అందాల భామ చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్‌గా, యూత్ మెచ్చే అంశాలతో తెరకెక్కించిన విధానం బాగుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరిచారు.
Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!
ఇక బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. జూన్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా చాలా త్వరగా పట్టుకొచ్చేస్తుంది. సమ్మతమే సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు తాము సిద్ధమే అని క్లూ ఇచ్చిన ఆహా వీడియో, తాజాగా ఇప్పుడు సమ్మతమే చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘‘కృష్ణుడి లీలలు, సత్యభామ అలకలు కథలే విన్నాము ఇప్పటివరకు.. కానీ అదే రోల్ రివర్స్ అయితే..?’’ అంటూ సమ్మతమే చిత్ర స్టోరీలైన్‌ను చెప్పుకొస్తూ, ఈ సినిమాను జూలై 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
కాగా, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరిలు తమ నటనతో ప్రేక్షకులను అలరించగా, ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అదనపు బలంగా మారింది. ఇక ఈ సినిమాను కంకణాల ప్రవీణ ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలంటే జూలై 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
