Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు పోటీగా....

Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!

Sammathame To Lock Ott Premiere Date

Sammathame: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కావడంతో, ఈ సినిమా కమర్షియల్ పరంగా కాస్త వెనకబడింది. కానీ, పబ్లిక్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందినీ చౌదరి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

Sammathame: సెన్సార్ పనులు ముగించుకున్న సమ్మతమే

ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో సమ్మతమే చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

Sammathame : ఒకే రోజు అయిదు ఊర్లలో సమ్మతమే ప్రమోషన్స్..

ఈమేరకు ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది చిత్ర యూనిట్. అయితే సమ్మతమే చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు తమకు సమ్మతమే కానీ.. అంటూ ఆహా వీడియో వారు ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.