Sammathame : ఒకే రోజు అయిదు ఊర్లలో సమ్మతమే ప్రమోషన్స్..

తాజాగా సమ్మతమే చిత్ర యూనిట్ గోదావరి జిల్లాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇవాళ (జూన్ 18)న ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు........

Sammathame : ఒకే రోజు అయిదు ఊర్లలో సమ్మతమే ప్రమోషన్స్..

Sammathame

Sammathame :  యువ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి నటించిన ‘సమ్మతమే’ సినిమా జూన్‌ 24న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇటీవలే సమ్మతమే ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రమోషనల్ టూర్స్ వేస్తున్నారు.

తాజాగా సమ్మతమే చిత్ర యూనిట్ గోదావరి జిల్లాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇవాళ (జూన్ 18)న ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఉదయం ద్రాక్షారామంలో టెంపుల్ లో పూజలు నిర్వహించి ఆ తర్వాత కాకినాడ పైదా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రిలోని ఓ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడతారు. ఆ తర్వాత మండపేటలో ఫ్యాన్స్ మీట్ నిర్వహించనున్నారు. ఇక రాత్రికి భీమవరంలోని ఓ మాల్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..

ఇలా ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు సమ్మతమే టీం. ఈ ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, దర్శకుడు గోపినాథ్, నిర్మాత, చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.