Sampoornesh Babu
Sampoornesh Babu: కేరాఫ్ కామెడీ కథలతో వరుసగా సినిమా చేస్తూ వస్తున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ‘కొబ్బరి మట్ట’, ‘క్యాలీ ఫ్లవర్’ సినిమాల ద్వారా తనదైన స్టయిల్లో ప్రేక్షకులను మరోసారి నవ్వించిన సంపూ.. ఇక ఈ ఏడాది కూడా తనదైన మార్కుతో నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి వడ్ల నాగ శారద సమర్పణలో ఓ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాతో దర్శకుడిగా జనార్ధన్ పరిచయమవుతున్నాడు.
Cauliflower : ఆమిర్ ఖాన్ తర్వాత సంపూనే.. టైటిల్ జస్టిఫికేషన్ అంట..
సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్టర్ బెగ్గర్` వీడు చిల్లరడగడు ట్యాగ్ లైన్. ఈ చిత్రం దిగ్విజయంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మోషన్ పోస్టర్ ఆవిష్కరించింది చిత్ర బృందం. విభిన్నంగా రూపొందించిన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. సరదా సరదాగా సాగే కామెడీ ఎంటర్ టైనర్ ఇదని.. ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
Sampoornesh Babu : బెగ్గర్‌గా సంపూర్ణేష్ బాబు
ఈ నెల 25న సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుండగా.. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. అనంతరం మరో షెడ్యూల్ లో పాటలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని యూనిట్ చెప్తుంది. అలీ, బాబు మోహన్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పీఆర్ సంగీతం అందిస్తున్నారు. మరి మిస్టర్ బెగ్గర్ గా సంపూర్ణేష్ బాబు ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.