Sampoornesh Babu : బెగ్గర్‌గా సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు సినిమాలతో పాటు సినిమా టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా మరో కొత్త టైటిల్ తో సంపూ రాబోతున్నాడు. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. సంపూ కొత్త సినిమా

Sampoornesh Babu : బెగ్గర్‌గా సంపూర్ణేష్ బాబు

Sampoo

Sampoornesh Babu :  డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఒక పక్క హీరోగా కామెడీ సినిమాలు చేస్తూ మరో పక్క వేరే సినిమాల్లో గెస్ట్ రోల్స్, కమెడియన్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాల్లోనూ అలరిస్తున్నాడు. త్వరలో సంపూ నటించిన ‘క్యాలీఫ్లవర్’ సినిమా రిలీజ్ కి రానుంది. తాజాగా మరో కొత్త టైటిల్ తో కొత్త సినిమాతో రాబోతున్నాడు సంపూ.

Surya : మరోసారి సూర్య దాతృత్వం.. రియల్ సినతల్లికి 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

సంపూర్ణేష్ బాబు సినిమాలతో పాటు సినిమా టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా మరో కొత్త టైటిల్ తో సంపూ రాబోతున్నాడు. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. సంపూ కొత్త సినిమా టైటిల్ ‘మిస్టర్ బెగ్గర్’. సంపూర్ణేష్‌బాబు, అద్వితిశెట్టిలు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Comedians : స్పెషల్ పార్టీతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ కమెడియన్స్

వడ్ల జనార్ధన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ విలన్ సత్యప్రకాష్‌ క్లాప్‌ కొట్టారు. సంపూర్ణేష్‌బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ… గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది. ఓ బిచ్చగాడి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలని కామెడీ రూపంలో తెరకెక్కించబోతున్నాము అన్నారు.