Comedians : స్పెషల్ పార్టీతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ కమెడియన్స్

టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ మనల్ని నవ్విస్తున్నారు. పాత కమెడియన్స్ ఉండగా కొత్త కమెడియన్స్ కూడా వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కొంతమంది కమెడియన్స్

Comedians : స్పెషల్ పార్టీతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ కమెడియన్స్

Comedians

Comedians :  టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ మనల్ని నవ్విస్తున్నారు. పాత కమెడియన్స్ ఉండగా కొత్త కమెడియన్స్ కూడా వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కొంతమంది కమెడియన్స్ అంతా కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్ ని పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్ తో పార్టీ చేసుకుంటారు. అందరూ ఒకే రకమైన డ్రెస్ లు కూడా వేసుకొస్తారు. టాలీవుడ్ కమెడియన్స్ అందర్నీ ఒకేచోట ఇలా చూస్తే కడుపు నిండిపోతుంది.

Surya : మరోసారి సూర్య దాతృత్వం.. రియల్ సినతల్లికి 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

ఈ గ్రూప్ లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, నందు, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్, వేణు, సత్య, రఘు, చిత్రం శ్రీను, సత్యం రాజేష్.. ఇలా ఇంకా కొంత మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తూ పార్టీలు ఇచ్చుకుంటూ కలిసి మెలిసి ఉంటారు. కరోనా వల్ల దాదాపు సంవత్సరంపైగా ఈ కమెడియన్స్ అంతా కలుసుకోలేదు.

Most Eligible Bachelor : ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని ఒక పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూడ్రెస్ లలో మెరిపించారు. ఈ పార్టీ గురించి ధనరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ అంటూ షేర్ చేశారు. వీళ్లంతా కలిసి దిగిన ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఇలాగే కొనసాగుతుంది.