SSS OTT: డైరెక్టర్ ఓటీటీలోకి శివాజీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
శివాజీ సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని(SSS OTT) సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసిన ఈటీవీ విన్.
- V Santhosh Kumar
- Published On : February 2, 2026 / 07:08 PM IST
Sampradayini Suppini Suddhapusani movie going to be streamed directly on OTT.
- డైరెక్టర్ ఓటీటీకి వస్తున్న సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని.
- అధికారిక ప్రకటన చేసిన ఈటీవీ విన్
- ఫిబ్రవరిలోనే స్ట్రీమింగ్
SSS OTT: టాలీవుడ్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని(SSS OTT). దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటి లయ శివాజీకి జోడీగా నటిస్తుంది. ఇక 90’స్ బయోపిక్ వెబ్ సిరీస్ తన నటనతో ఆకట్టుకున్న రోహన్ మరో కీ రోల్ చేస్తున్నాడు. క్రైం కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ దివి.. చీరలో అందాల విందు చేసింది.. ఫొటోలు
ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలనీ చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో, ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా 90’స్ ది మిడిల్ క్లాస్ బయోపిక్ లాగానే మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నారు మూవీ టీం. చూడాలి మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అని.
