పబ్లిక్‌లో బ్రా వేసుకుంటావా?.. పార్క్‌లో హీరోయిన్‌పై దాడి..

  • Publish Date - September 5, 2020 / 03:15 PM IST

Samyuktha Hegde Wearing Workout Clothes: పాపులర్ కన్నడ హీరోయిన్ సంయుక్తా హెగ్డేకి ఊహించని షాక్ త‌గిలింది.. ఆమె ధరించిన డ్రెస్ విషయమై పార్కులో వర్కౌట్స్ చేస్తుండగా సామాజిక కార్యకర్తలని చెప్పుకునే కొందరు యువకులు సంయుక్తపై దాడి చేశారు.


వివరాల్లోకెళ్తే.. తెలుగులో నాగార్జున‌తో ‘మ‌న్మ‌థుడు 2’, నిఖిల్‌తో ‘కిర్రాక్ పార్టీ’ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించింది సంయుక్తా హెగ్డే. ఈమె బెంగ‌ళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డ్యాన్స్‌, వ‌ర్క‌ౌట్స్ చేయ‌డానికి కొంత మంది స్నేహితులతో క‌లిసి చేరుకున్నారు.




ఆ స‌మయంలో అక్క‌డున్న‌ క‌వితా రెడ్డి అనే మ‌హిళ సంయుక్త‌పై దాడి చేసింది. స‌దరు దాడి చేసిన మ‌హిళకు అక్క‌డే ఉన్న కొంత మంది ప‌బ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ నటీనటులందరూ డ్ర‌గ్స్ వాడుతారంటూ సంయుక్తా హెగ్డేపై దాడికి దిగారు.


ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన సంయుక్త‌.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన విష‌యాన్ని తెలియ‌జేశారు. ఆమెపై దాడికి పాల్పడినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కట్ చేస్తే.. సంయుక్త రోజూ అసభ్యకరమైన దుస్తులు ధరించి వర్కౌట్స్ చేస్తోందని కొందరు ఫిర్యాదు చేయడంతోనే సామాజిక కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది.