Samyuktha Menon removed her surname and tells why in sir movie promotions
Samyuktha Menon : ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
భీమ్లా నాయక్, బింబిసార సినిమాల తర్వాత సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది హీరోయిన్ సంయుక్త మీనన్. వరుసగా తెలుగులో రెండు హిట్స్ కొట్టిన సంయుక్త మీనన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడింది.
సంయుక్త మీనన్ గా పరిశ్రమకు పరిచయమైన కొన్ని రోజుల తర్వాత మీనన్ అని తన ఇంటి పేరుని తీసేసింది. సోషల్ మీడియాలో కూడా తన పేరు పక్కన మీనన్ తీసేసింది. తాజాగా ఇచ్చినా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. దీని గురించి గతంలో కూడా చెప్పాను. నా ఇంటిపేరు చూసి నాకు గుర్తింపు రాకూడదు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందుకే నా ఇంటిపేరుని తొలిగించాను. నా పేరుతోనే నేను గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాను, అందుకే మీనన్ తీసేసాను అని తెలిపింది.
Writer Padmabhushan : 10 కోట్ల రైటర్ పద్మభూషణ్.. లాభాలే లాభాలు.. సూపర్ ఫామ్ లో ఉన్న సుహాస్..
అలాగే తనని కొంతమంది సమంతలా ఉన్నవని పోల్చడంపై మాట్లాడుతూ.. ఈ మాట నాకు కూడా చాలా మంది చెప్పారు. నేను కొన్ని సార్లు సమంతలా కనిపిస్తానని అన్నారు. నాలో సమంత పోలికలు ఉన్నాయన్నారు. సమంత చాలా గొప్ప నటి, చాలా ధైర్యవంతురాలు కూడా. నా నటనని చూసి సమంతలా చేస్తున్నావు అంటే మరింత సంతోషిస్తాను అని తెలిపింది. అలాగే ప్రేమికుల దినోత్సవం, ప్రేమ గురించి స్పందిస్తూ.. విశ్వంలో ప్రతిదీ ప్రేమతో నిండి ఉంటుంది. ఈ మధ్య చాలా మంది ప్రేమ అంటే కేవలం రొమాన్స్ అని మాత్రమే భావిస్తున్నారు, కానీ అది చాలా తప్పు. నా వరకు నన్ను గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అయితే ఇప్పట్లో చేసుకోను, దానికి ఇంకా టైం ఉంది అని తెలిపింది.