Ragini Dwivedi: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది జైల్లో జారిపడింది. ఈ నేపథ్యంలో తనకు ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది.
జైల్లో తను జారి పడ్డానని, నడుముకు, వెన్నుకు తీవ్ర గాయాలయ్యాయని తన పిటీషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం జైల్లో తనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆరోగ్యం మెరుగుపడలేదని ఆమె తెలిపింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరింది.
రాగిణి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా సీసీబీ పోలీసులకు సూచించడంతో పాటు విచారణను వాయిదా వేసింది. కాగా ఈ నెల 23 వరకు రాగిణికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మరోనటి సంజన గల్రాని కూడా రిమాండ్‌లోనే ఉంది.