Risk : ‘రిస్క్’ ట్రైలర్ చూశారా..? డైరెక్టర్ గా మారిన సంగీత దర్శకుడు..
మీరు కూడా రిస్క్ ట్రైలర్ చూసేయండి.. (Risk)
- Saketh U
- Published on- May 31, 2026 / 01:58 PM IST
Risk
Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి, రాజీవ్ కనకాల,అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆశు రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు.
మీరు కూడా రిస్క్ ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. రిస్క్ టైటిల్, ట్రైలర్ బాగుందని, యువతకు ఈ సినిమా నచ్చుతుందని మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. హీరో సందీప్ మాట్లాడుతూ.. మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఇదే నా తొలి విజయంగా భావిస్తున్నాను. రిస్క్ లో ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, కామెడీ, లవ్ ఉంటే సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఘంటాడి కృష్ణ గారు పాటలతోనే కథ చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.
డైరెక్టర్ ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. నా ఆశ నా శ్వాస సంగీతం. 16, సంపంగి.. లాంటి సినిమాలోని నా పాటలతో ఎంతోమందికి దగ్గరయ్యాను. దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాకు ‘16-2’ అనే టైటిల్ అనుకున్నాం కానీ ‘రిస్క్’ అనే టైటిల్ బాగుంటుందని మా హీరో సందీప్ సూచించారు. ఈ సినిమాకు పాటలు కూడా నేనే చేశాను అని తెలిపారు. ఆషు రెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా క్యూరియాసిటీని కలిగించింది. నా ఫ్రెండ్ సందీప్ ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా కష్టపడ్డాడు అని తెలిపింది.
