Sandeep Vanga : బాలీవుడ్ రైటర్‌కి సందీప్ వంగ కౌంటర్.. రచయితగా మీరు రాసిందంతా అబద్దం..
బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ కి సందీప్ వంగ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు రచయితగా మీరు రాసిందంతా అబద్దమే..
- gum 95921
- Published on- January 7, 2024 / 05:39 PM IST
Sandeep Reddy Vanga counter tweet to Javed Akhtar comments about Animal movie
Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ సినిమా.. బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రణబీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో పాటు అనేక విమర్శలు కూడా ఎదుర్కొంది.
ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ రైటర్ జావేద్ అక్తర్ ఈ మూవీ పై ఘాటు విమర్శలే చేశారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో త్రిప్తి దిమ్రిని రణబీర్ తన బూట్లు నాకమని చెబుతాడు. ఈ సీన్ గురించి రియాక్ట్ అవుతూ జావేద్ అక్తర్ ఇలా ట్వీట్ చేశారు.. “ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తన బూట్లు నాకమని చెప్పడం, అమ్మాయిని కొట్టడం వంటి సన్నివేశాలతో వచ్చి సూపర్ హిట్ అయిన యానిమల్ లాంటి సినిమా వ్యవస్థకి చాలా ప్రమాదకరం” అంటూ విమర్శలు చేశారు.
Also read :Sankranthi Movies : సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏ ఓటీటీకి వస్తున్నాయో తెలుసా..?
ఇక ఈ విమర్శలకి సందీప్ వంగ బదులిస్తూ యానిమల్ మూవీ ట్విట్టర్ నుంచి బదులిచ్చారు. “ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేతిలో మోసపోయినప్పుడు, ఆమె అతన్ని తన బూట్లు నాకమని చెప్తే అది మీకు ఓకే. దానిని ఫెమినిజం అంటూ చప్పట్లు కొడతారు. ప్రేమ అనే విషయానికి జెండర్ పాలిటిక్స్ ని ఆపాదించకండి. ప్రేమించుకున్న లవర్స్‌లో ఒకరు మోసపోయినప్పుడు, వారు కోపంతో ఏం చేశారు అనేది మాత్రమే చూడండి. అయినా ఎన్నో సినిమాలకు రచయితగా చేసిన మీకు ఆ విషయం అర్ధం కాలేదంటే.. ఇన్నాళ్లు మీరు రాసిందంతా అబద్దమే” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా జావేద్ అక్తర్.. షోలే, జంజీర్, మిస్టర్ ఇండియా, అంజాజ్, డాన్, యాదొంకి బారత్, దీవార్, కాలా పత్తర్ వంటి బాలీవుడ్ ఇండస్ట్రీ చిత్రాలకు రైటర్ గా పని చేశారు. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం రీసెంట్ గా ముంబైలో భారీ సక్సెస్ పార్టీ జరుపుకున్నారు.
