Sankranthi Movies : సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏ ఓటీటీకి వస్తున్నాయో తెలుసా..?
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏఏ ఓటీటీకి వస్తున్నాయో తెలుసా..? అలాగే ఏ టీవీ ఛానల్ లో ప్రసారం కాబోతున్నాయో తెలుసా..?

Sankranthi Movies Guntur Kaaram Hanuman Saindhav Naa Sami Ranga OTT Details
Sankranthi Movies : సంక్రాంతి అంటే తెలుగు ఆడియన్స్ కి సినిమా పండగలా కనిపిస్తుంది. బడా స్టార్స్ అంతా అదిరిపోయే సినిమాలతో సంక్రాంతికి వస్తుంటారు. ఇక ఈసారి సంక్రాంతికి అయితే గట్టి పోటీ నెలకుంది. ఈ పండుగ బరిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ పోటీ పడబోతున్నాయి. థియేటర్స్ లో ఒకటి రెండు రోజుల వ్యవధిలో రిలీజవుతున్న ఈ చిత్రాలు.. ఆ తరువాత ఏ ఓటీటీలోకి రాబోతున్నాయి..?
గుంటూరు కారం..
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’ జనవరి 12న రికార్డు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. అయితే ఈ చిత్రం సాటిలైట్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.
హనుమాన్..
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రం ‘హనుమాన్’. దాదాపు 11 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సూపర్ హీరో సినిమా ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమ్ కానుంది. ఇక సాటిలైట్ రైట్స్ వచ్చి జీ టీవీకి వెళ్లాయి.
సైంధవ్..
విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 75వ సినిమాగా ‘సైంధవ్’ని సిద్ధం చేసి ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. ఈటీవీ ఈ మూవీ సాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
నా సామిరంగ..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’ సినిమా మలయాళ చిత్రానికి రీమేక్ గా వస్తుంది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే ప్రసారం కానుంది. ఇక సాటిలైట్ రైట్స్ స్టార్ మా చేతికి వెళ్లాయి.