Sandeep Reddy Vanga : ‘ఉప్పెన’ చూసి అలా ఫీల్ అయిన సందీప్ వంగ.. అలాగే ఆ రెండు బయోపిక్స్..

తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'ఉప్పెన' చూసి అలా ఫీల్ అయిన సందీప్ వంగ. అలాగే మహానటి, మైఖేల్ జాక్సన్ బయోపిక్స్..

Sandeep Reddy Vanga interesting comments about Uppena Mahanati movies

Sandeep Reddy Vanga : టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో
ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ఈ దర్శకుడి తదుపరి సినిమాల పై ఆడియన్స్ లో ఎంతో క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ దర్శకుడు రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పటు పలు ఆసక్తికర విషయాలు గురించి మాట్లాడారు.

ఇప్పటివరకు సందీప్ వంగ డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలకు తానే కథని రాసుకున్నారు. ఒకవేళ వేరేవాళ్ళ స్క్రిప్ట్ నచ్చితే సందీప్ వంగకి నచ్చితే, ఆ కథతో సినిమా చేస్తారా..? అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి సందీప్ వంగ బదులిస్తూ.. “నిజానికి నేను నిర్మాతగా సినిమా తెరకెక్కించాలని కొన్ని కథలు విన్నాను. కానీ, అవేవి నచ్చలేదు. నాకు నచ్చేలా కథ ఉంటే నిర్మించడానికి, డైరెక్ట్ చేయడానికి నేను సిద్దమే” అని చెప్పుకొచ్చారు.

Also read : Spirit : ప్రభాస్ ‘స్పిరిట్‌’ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పిన సందీప్ వంగ.. మొదటిరోజే 150 కోట్లు వస్తాయంట..

తెలుగులో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన డిఫరెంట్ లవ్ స్టోరీస్ బేబీ అండ్ ఉప్పెన. ఈ రెండు చిత్రాల్లో ఏది మీరు డైరెక్ట్ చేసి ఉంటే బాగుండని ఫీల్ అయ్యారు..? అని ప్రశ్నించగా, సందీప్ వంగ బదులిస్తూ.. “డైరెక్ట్ చేయాలని కాదు గాని, ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదని ఫీల్ అయ్యాను ‘ఉప్పెన’ సినిమా చూసి. చాలా డిఫరెంట్ ఐడియా అది” అంటూ ఉప్పెన సినిమా పై తన ఇష్టాన్ని చెప్పుకొచ్చారు.

ఇక అలాగే తనకి మహానటి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన సందీప్ వంగ.. ఆ సినిమా విషయంలో మాత్రం అలాంటి బయోపిక్ ని డైరెక్ట్ చేయలేకపోయాను అని ఫీల్ అయ్యినట్లు పేర్కొన్నారు. అలాగే ఒకవేళ తాను డైరెక్ట్ చేయాల్సి వస్తే.. ఇంకే బయోపిక్ డైరెక్ట్ చేస్తారు అని వంగని ప్రశ్నించారు. దీనికి సందీప్ వంగ బదులిస్తూ.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ చేయాలని డ్రీం ఉందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.