Animal Park : ‘యానిమల్ పార్క్’ ఇప్పటిలో చేసేది లేదు.. సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్..
'యానిమల్ పార్క్' ఇప్పటిలో చేసేది లేదు అంటూ ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ.
- gum 95921
- Published on- April 15, 2024 / 08:36 PM IST
Sandeep Reddy Vanga shocking comments about Ranbir Kapoor Animal Park
Animal Park : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘యానిమల్’. రణబీర్ ఆల్ఫా మేల్ పాత్రలో కనిపించి ఆఫీస్ ని షేక్ చేసి వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేశారు. ఇక ఈ సినిమా చివరిలోనే సందీప్ వంగ.. ‘యానిమల్ పార్క్’ అంటూ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ లో రణబీర్ రోల్ లో కనిపించి అదరగొట్టబోతున్నారు.
ఇక ఈ సీక్వెల్ యానిమల్ మూవీ కంటే ఎక్కువ వైల్డ్ గా ఉంటుందని సందీప్ వంగ కామెంట్స్ చేయడంతో.. సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని.. ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కాబోతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా స్టార్ అవ్వడానికి రెండేళ్లు పడుతుందట.
Also read : Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు కామెంట్స్.. పబ్లిసిటీ స్టంట్ అంటూ..
తమిళ్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న సందీప్ వంగని.. ఈ మూవీ అప్డేట్ గురించి ప్రశ్నించారు. ఇక దీనికి వంగ బదులిస్తూ.. “ఈ సీక్వెల్ యానిమల్ కంటే వైల్డ్ గా, భారీగా ఉంటుంది. 2026లో ఈ సినిమా స్టార్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో యానిమల్ మూవీ ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు. అయితే ప్రభాస్ స్పిరిట్ వల్లే ఇంత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
స్పిరిట్ మూవీని ఈ ఏడాది చివరిలో స్టార్ట్ చేయనున్నారు. షూటింగ్ అంతా పూర్తీ చేసి సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు 2025 ఎండింగ్ అవుతుంది. ఈ సినిమా ఆలస్యంతో యానిమల్ పార్క్ రిలీజ్ లేట్ అవుతుంది. కాగా యానిమల్ పార్క్ మూవీలో రణ్‌బీర్ తో పాటు రష్మిక పాత్ర కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట.
