Animal : యానిమల్ వచ్చేస్తుంది.. టీజర్ డేట్ ఫిక్స్.. బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి హవా మరోసారి షురూ..

ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా యానిమల్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.

Sandeep Vanga Ranbir Kapoor Bollywood Movie Animal Teaser release date announced

Animal Teaser : ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Vanga). అదే సినిమాని బాలీవుడ్(Bollywood) లో కబీర్ సింగ్(Kabir Singh) పేరుతో తీసి అక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పుడు సందీప్ వంగ చేతిలో మూడు సినిమాలు ఉండగా రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో యానిమల్ అనే సినిమాతో త్వరలో రానున్నాడు.

సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ తో ఈ సినిమాను గ్రాండ్ గా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచారు. ప్రీ టీజర్ లో రణబీర్ గొడ్డలి పట్టి విలన్ మనుషులని నరకడం చూపించి సినిమా ఎంత వయోలెంట్ గా ఉంటుందో హింట్ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ తో పాటు సందీప్ వంగ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడా అని టాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది.

Vinayakan : రజినీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ సెట్స్‌లోకి వచ్చి..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. తాజాగా యానిమల్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. యానిమల్ టీజర్ సెప్టెంబర్ 28 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో రణబీర్ అభిమానులు ఈ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ లో ఇంకెంత వయోలెన్స్ చూపిస్తారో చూడాలి. ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు, రణబీర్ డాన్ గా కనపడబోతున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు