Sanjana Galrani : టాలీవుడ్ లో పెద్ద నిర్మాత.. కోట్లు నష్టపోయాను.. సంజన సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజన దాదాపు రెండు కోట్లు నష్టపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. (Sanjana Galrani)

  • Published on- May 10, 2026 / 01:41 PM IST

Sanjana Galrani

Sanjana Galrani : ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 50కి పైగా సినిమాలు చేసిన సంజన గల్రాని మధ్యలో డ్రగ్స్ ఆరోపణలు, జైలుకి వెళ్లి రావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సంజన. ప్రస్తుతం టీవీ షో లు, సీరియల్స్ తో బిజీగా ఉంది.

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజన దాదాపు రెండు కోట్లు నష్టపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Rukmini Vasanth : మదర్స్ డే.. తల్లితో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రుక్మిణి వసంత్.. ఫొటోలు..

సంజన గల్రాని మాట్లాడుతూ.. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో పుట్టాను. నేను ఫస్ట్ సినిమా మీటింగ్ కి వెళ్తున్నప్పుడు కూడా సగం దూరం నడిచి వెళ్ళా. సగం దూరం ఆటోలో వెళ్ళా. నేను నా పేరెంట్స్ ని చూసుకోవాలి అప్పుడు. అలా డబ్బులు సేవ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు తెలిసిన వాళ్లకు ఓ నలుగురు ఐదుగురికి దాదాపు రెండు కోట్లు ఇచ్చి నష్టపోయాను. అందులో తెలుగు ఇండస్ట్రీలో ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారు.

ఇప్పుడు కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదు. నాకు తర్వాత జ్యోతిష్కులు కూడా చెప్పారు నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు అని. ఇప్పుడు నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని తెలిపింది. అయితే సంజన దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరో మాత్రం చెప్పలేదు.

Also Read : Sanjana Galrani : ఫ్రెండ్స్ నన్ను బలిపశువుని చేశారు.. జైలులో చనిపోదాం అనుకున్నా.. సంజన ఎమోషనల్..