Sanjana Galrani : ఫ్రెండ్స్ నన్ను బలిపశువుని చేశారు.. జైలులో చనిపోదాం అనుకున్నా.. సంజన ఎమోషనల్..
తాజాగా సంజన గల్రాని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు తెలిపింది. (Sanjana Galrani)
Sanjana Galrani
Sanjana Galrani : ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 50కి పైగా సినిమాలు చేసిన సంజన గల్రాని మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షో లు, సీరియల్స్ తో బిజీగా ఉంది సంజన. గతంలో కొన్నేళ్ల క్రితం సంజనపై డ్రగ్స్ ఆరోపణలు చేసి జైలుకి పంపించారు. ఆ తర్వాత ఆ కేసులో సంజన నిర్దోషిగా బయటకు వచ్చింది.
తాజాగా సంజన గల్రాని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు తెలిపింది. ఈ క్రమంలో ఆ డ్రగ్స్ కేసు, జైలు జీవితం గురించి మాట్లాడింది.
Also Read : Trisha : విజయ్ ప్రమాణ స్వీకారంలో సందడి చేసిన త్రిష.. ఫొటోలు వైరల్..
సంజన గల్రాని మాట్లాడుతూ.. నా మీద చాలా బ్యాడ్ నేమ్ వేశారు. చాలా వరస్ట్ కాంట్రవర్సీలో దింపారు. నన్ను బలిపశువుని చేసారు. ఇప్పటికి నన్ను నెగిటివ్ గా మాట్లాడతారు ఆ విషయంలో. చాలా వరస్ట్ పరిస్థితులు ఫేస్ చేశాను. నేను ఫేస్ చేసినవి శత్రువుకి కూడా రాకూడదు. జైలుకు వెళ్లడం చావు లాంటిది. అప్పుడు బతకాలనిపించలేదు. చావు దాకా వెళ్ళొచ్చాను. జైలులో ఉన్నప్పుడు లో బీపీ, డిప్రెషన్, బరువు తగ్గాను, ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అలాంటి రోజులు ఎవరికీ రాకూడదు. కానీ ఇప్పుడు అన్నిటి నుంచి బయటకు వచ్చాను. నేను ఏదైనా చేసుకుంటే నా పేరెంట్స్, పిల్లలు, భర్త ఉన్నారు అని వాళ్ళ కోసం బతకాలి అనుకున్నాను. ఆ నిందని పోగొట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను.
ఆ లీగల్ ప్రాబ్లమ్ వచ్చాక నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. నేను చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. వీక్ అమ్మాయిని కాదు. కానీ అంతలా ఏడ్చాను. రాత్రి అంతా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మందు, డ్రగ్స్ వాడాను అన్నారు. ఇప్పుడు మూడు నెలలు బిగ్ బాస్ లోపల ఉన్నాను. ఏం అడిక్షన్స్ చూసారు నాలో. నేను అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట పడినా ప్రూఫ్స్ ఏం లేకుండా నా పేరు బ్యాడ్ చేసారు. ఇది కావాలనే చేసారు. మేము ఎదిగితే చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. తప్పుడు మనుషులతో ఫ్రెండ్షిప్ వల్ల ఇది జరిగింది. కలిసినపుడు మంచివాళ్ళుగా నమ్మించారు. తెలిసిన వాళ్ళే చేశారు. ఇప్పుడు ఎవర్ని నమ్మను. వాళ్ళు చేసిన తప్పు వల్ల నామీద ఎఫెక్ట్ అయింది నేను సెలబ్రిటీ కాబట్టి. నా పిల్లలకు అది తెలియకూడదు. తన తల్లి గురించి నెగిటివ్ గా వినకూడదు. ఆ మచ్చ నేను పోగొట్టుకోవాలి. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాను. ప్రూఫ్స్ లేకుండా ఎవరో ఎదో చెప్తే నెగిటివ్ కామెంట్స్ తో నింద వేస్తారు. నన్ను ఇంకా తగ్గించాలని చూస్తే ట్రై చేయండి నేను మళ్ళీ ఇలా నిలబడి చూపిస్తా అని అన్నారు.
Also See : Patas Praveen : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫొటోలు..
