Top Stars: బాక్సాఫీస్ బాద్‌షాలు.. వెయ్యి కోట్ల క్లబ్‌లో సంజయ్ దత్ టాప్.. ప్రభాస్, షారుఖ్ లది ఎన్నో ప్లేస్ తెలుసా?
వెయ్యి కోట్ల సినిమాల్లో నటించిన స్టార్స్ లిస్టులో టాప్ పొజిషల్ లో ఉన్న బాలీవుడ్ స్టార్(Top Stars) సంజయ్ దత్.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 03:36 PM IST
Sanjay Dutt holds the top position on the list of stars who have achieved the 1000 crore milestone.
- వెయ్యి కోట్ల క్లబ్‌లో సంజయ్ దత్ 4 సినిమాలు
- ప్రభాస్ మూడు, షారుఖ్ రెండు, సినిమాలు
- లిస్టులో చోటు దక్కించుకున్న దీపిక పదుకొనె
Top Stars: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు వంద కోట్లు సాధిస్తేనే గొప్ప అనుకునే స్థాయి నుంచి, ఇప్పుడు వెయ్యి లేదా రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లే లక్ష్యంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనబరుస్తున్న ప్రభామే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామం కేవలం సినిమాల విజయానికే పరిమితం కాకుండా, నటుల(Top Stars) మధ్య ఉన్న క్రేజ్, మార్కెట్ స్టామినాకు ఒక కొలమానంగా మారింది. ఏ నటుడి ఖాతాలో ఎన్ని వేల కోట్ల సినిమాలు ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
Peddi: హిట్ కొట్టింది.. ఛాన్స్ పట్టేసింది.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో
ఈ రేసులో బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నటించిన ధురంధర్, ధురంధర్ 2, కేజీఎఫ్ 2, జవాన్ వంటి నాలుగు చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించాయి. అలా భారతీయ చిత్ర పరిశ్రమలో నాలుగు వెయ్యి కోట్ల చిత్రాలలో భాగమైన ఏకైక నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇందులో కొన్ని చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడిగా, అతిథి పాత్రల్లో కనిపించినప్పటికీ, ఆ సినిమాల భారీ విజయం ఆయన ఖాతాలో చేరడం విశేషం.
రెండో స్థానంలో మూడు వెయ్యి కోట్ల సినిమాలతో (పఠాన్, జవాన్, కల్కి 2898 AD) దీపికా పదుకొనె నిలిచారు. ఇక టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2, కల్కి 2898 AD చిత్రాలతో రెండు వెయ్యి కోట్ల సినిమాలను తన పేరిట దక్కించుకున్నాడు. వీరితో పాటు షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సాన్యా మల్హోత్రా కూడా రెండేసి చిత్రాలతో ఈ ప్రతిష్టాత్మక జాబితాలో కొనసాగుతున్నారు. సినిమాల మధ్య పోటీ ఇప్పుడు నటుల వ్యక్తిగత బాక్సాఫీస్ రికార్డుల వైపు మళ్లడం సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ లిస్టులో ఇంకా ఎన్ని సినిమాలు చేరుతాయి అనేది చూడాలి.
