Peddi: హిట్ కొట్టింది.. ఛాన్స్ పట్టేసింది.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో
పెద్ది(Peddi) సినిమాలో రామ్ చరణ్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేస్తున్న లేటెస్ట్ బ్యూటీ మానస వారణాసి.
manasa varanasi doing special song in ram charan peddi movie
- పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్
- రామ్ చరణ్ తో స్టెప్పులు వేయనున్న మానస వారణాసి
- ఈ పాటతో పెద్ది షూటింగ్ కంప్లీట్
Peddi: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడువులైన కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. పెద్ది పహిల్వాన్ టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే, పెద్ది(Peddi) సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాటలో చరణ్‌తో కలిసి స్టెప్పులేసేది ఎవరు అని చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఫైనల్ గా తెలుగమ్మాయి మానస వారణాసిని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మడు ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమెను ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Dacoit Censor Review: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. అడివి శేష్ సినిమా ఎలా ఉందంటే?
జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను కాదని, చిత్రబృందం మానస వారణాసిని ఫిక్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్‌చరణ్ కెరీర్లో మరో వైవిధ్యమైన చిత్రంగా ‘పెద్ది’ నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం షూటింగ్ పూర్తి పెద్ది సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, అనుకున్న డేట్ కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
