KD Song : డబల్ మీనింగ్ లిరిక్స్.. ఫుల్ ట్రోల్స్.. దెబ్బకి సాంగ్ డిలీట్ చేసేశారుగా..
దీంతో సోషల్ మీడియాలో ఆ సాంగ్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది. (KD Song)
- Saketh U
- Published On : March 17, 2026 / 09:22 PM IST
KD Song
KD Song : సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో ఈ మధ్య గ్లామర్ శ్రుతి మించుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లిరిక్స్ కూడా మరింత వల్గర్‌గా ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఓ పాన్ ఇండియా సినిమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆ సాంగ్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.
కన్నడ యాక్షన్ హీరో ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కేడీ ది డెవిల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా కేవీఎన్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి హిందీలో నోరా ఫతేహి చేసిన ‘సర్కే చునర్ తేరి సర్కే..’ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. దీంతో ఈ సాంగ్ నెట్టింట కాంట్రవర్సీ అవుతోంది.
ఈ పాటని బాలీవుడ్ లో రకీబ్ ఆలం రాశారు. కేడీ ది డెవిల్ సినిమాలో నోరా ఫతేహి చేసిన ఈ స్పెషల్ సాంగ్‌పై ఫైర్ అవుతున్నారు ఆడియెన్స్, నెటిజన్లు. సాంగ్ లిరిక్స్ డబుల్ మీనింగ్‌తో ఉన్నాయని, కొరియోగ్రఫీ కూడా చాలా వల్గర్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. సినిమా నుంచి ఈ స్పెషల్ సాంగ్‌ని తొలగించాలని కోరుతున్నారు. ఇలాంటి పాటలను చిన్నపిల్లలు రీల్స్‌లో అనుకరిస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.
సర్కే చునర్ తేరి సర్కే.. సాంగ్ ని బ్యాన్ చేయాలని ముంబైకి చెందిన ఓ లాయర్ CBFCతో పాటు మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌కి కంప్లైట్ చేశారు. సాంగ్ లిరిక్స్ అండ్ విజువల్స్ వల్గర్‌గా ఉన్నాయని కంప్లైంట్ ఫైల్ చేశారు. దీంతో దెబ్బకి కేడీ ది డెవిల్ సినిమాలోని నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ హిందీ వర్షన్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగించారు మేకర్స్.
Also Read : Harish Shankar : ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడో తెలుసా?
అయితే మిగిలిన భాషల్లో కూడా ఈ పాటని రిలీజ్ చేసారు. కానీ లిరిక్స్ మార్చడంతో వాటిపై అంత కాంట్రవర్సీ రాలేదు. ఈ పాట తెలుగు వర్షన్‌కి చంద్రబోస్ లిరిక్స్ అందిచకగా సింగర్ మంగ్లీ ఆలపించారు. మరి మిగిలిన లాంగ్వేజెస్‌లో కూడా ఈ స్పెషల్ సాంగ్ రిమూవ్ చేస్తారా లేదా అనేది చూడాలి. సినిమాలో ఈ పాట ఉంటుందా? లిరిక్స్ మార్చి పెడతారా చూడాలి మరి. సాంగ్ డిలీట్ చేసినా ప్రోమో మాత్రం అలాగే ఉంచారు.
వివాదంగా మారిన సాంగ్ ప్రోమో ఇక్కడ చూసేయండి..
