Sankranti 2025 : వచ్చే సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ.. మళ్ళీ చిరు వర్సెస్ బాలయ్య?.. ఆ ముగ్గురు కూడా?

బస్సుల్లో, ట్రైన్స్ లో కర్చీఫ్ లు వేసి సీట్ బుక్ చేసుకున్నట్టు వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాలు అనౌన్స్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు.

Sankranti 2025 Movies Ready to Race from Now Chiranjeevi Balakrishna Nagarjuna Dil Raju Prashanth Varma Occupied Sankranti

Sankranti 2025 : సంక్రాంతి అంటే పండగతో పాటు సినిమాలు కూడా. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీలతో సహా సినిమాలకు వెళ్తారు. సంక్రాంతి సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగా వస్తాయి. అందుకే స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు అంతా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటారు. కానీ సంక్రాంతికి ఒకే సరి చాలా సినిమాలు వస్తే థియేటర్స్ ఇష్యూ కూడా వస్తుంది.

ఇటీవలే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటు వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుదాం అనుకుంటే థియేటర్స్ ఇష్యూ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా థియేటర్ల ఇబ్బంది తప్పలేదు. గతంలో కంటే ఈ సారి థియేటర్స్ ఇష్యూ కొంచెం పెద్దగానే జరగడంతో ఇప్పట్నుంచే కొంతమంది వచ్చే సంక్రాంతికి సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారు.

బస్సుల్లో, ట్రైన్స్ లో కర్చీఫ్ లు వేసి సీట్ బుక్ చేసుకున్నట్టు వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాలు అనౌన్స్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు. గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో పలకరించిన మెగాస్టార్ చిరంజీవి వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమాతో రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 2025 సంక్రాంతి బరిలో చిరంజీవి(Chiranjeevi) తన విశ్వంభర(Vishwambhara) సినిమాతో రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక సంక్రాంతి అంటే దిల్ రాజు(Dil Raju) ముందు వరసలో ఉంటాడు. తన నుంచి ఒక సినిమా కచ్చితంగా సంక్రాతికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఈ సంవత్సరం హనుమాన్ తప్ప మిగిలిన మూడు సినిమాలు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్ తో వస్తాను అని ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు.

అలాగే నాగార్జున(Nagarjuna) కూడా సంక్రాంతికి కుదిరితే తన సినిమాని రిలీజ్ చేసి హిట్ కొడతారు. ఈ సంక్రాంతికి నా సామిరంగతో(Naa Saami Ranga) హిట్ కొట్టిన నాగ్ నెక్స్ట్ సంక్రాంతి బరిలో కూడా నిలవాలని చూస్తున్నారు. గతంలో సోగ్గాడే చిన్ని నాయనా, దానికి కొనసాగింపుగా బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యాయి. దానికి ఇంకో కొనసాగింపు కూడా ఉంటుందని గతంలోనే చెప్పాడు నాగ్. దీంతో బంగార్రాజుకి కొనసాగింపుగా సంక్రాంతికి మళ్ళీ పండగ లాంటి సినిమాతో నాగార్జున వస్తాడని సమాచారం. అందరికంటే లేట్ గా సినిమా అనౌన్స్ చేసి సంక్రాంతి బరిలో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇక బాలకృష్ణ(Balakrishna) కూడా వచ్చే సంక్రాంతి బరిలో ఉంటాడని టాక్ వస్తుంది. గత సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య వర్సెస్ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు రాగా రెండు మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమా చేస్తున్నాడు. ఇది దసరా రిలీజ్ అని చెప్పారు. కానీ త్వరలో ఏపీ ఎలక్షన్స్ ఉండటంతో బాలయ్య దాంట్లో బిజీ ఉన్నాడు. ఒకవేళ సినిమా లేట్ అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండొచ్చు అని టాక్. లేదా ఈ సినిమా చెప్పిన టైంకి దసరాకే వచ్చేస్తే అఖండ 2 లైన్లో పెట్టి దాన్ని సంక్రాంతికి తీసుకొస్తారని తెలుస్తుంది. దీంతో ఈసారి కూడా చిరు వర్సెస్ బాలయ్య పోటీ ఉండేలా కనిపిస్తుంది.

ఇక వీటితో పాటు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి కూడా ఇంకో సినిమా ఉండొచ్చు. ఇటీవల ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో ఇక నుంచి ప్రతి సంక్రాంతికి నా నుంచి ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ ప్రశాంత్ వర్మది ఓ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అధీర సినిమా లైన్లో పెట్టాడు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా 2025 లో అని అనౌన్స్ చేసాడు. దీంతో 2025 సంక్రాంతికి కూడా ప్రశాంత్ వర్మ నుంచి ఓ సినిమా కచ్చితంగా ఉంటుంది అని తెలుస్తుంది.

ఇలా వచ్చే సంక్రాంతికి ఇప్పుడే అయిదు సినిమాలు బరిలో నిలిచాయి. మరి వీటిల్లో చివరకు ఎన్ని నిలుస్తాయి? ఇంకా కొత్తవి ఏమైనా వస్తాయా అంటే వచ్చే సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే.